News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్‌పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు కర్ణాటక మధ్య 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. సిఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు తమకు సమాచారం రావడంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గశేష్ సర్కిల్ కు చెందిన మట్కా బీటర్ యువరాజ్, బబ్బులమ్మ గుడికి చెందిన హనుమన్న మరియు బోయ గేరికి చెందిన వీరేష్ ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 7 బాక్సుల కర్నాటక మధ్యంను తీసుకొని వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ల లను స్వాధీనం చేసుకొని వారి ముగ్గురిని అరెస్టు చేసి , కేసు నమోదు పరచి రిమాండ్ కి తరలించామని తెలిపారు.
ఈ దాడుల్లో నందు 1 టౌన్ CI విక్రమసింహ, SI జహీర్ , సిబ్బంది రంగస్వామి, HC వీరా రెడ్డి, సుధీర్ , రంగస్వామి, అయ్యన్న మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసుల విజ్ఞప్తి…
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్, పేకాట ల గురించి
9121101135 నెంబరు కు సమాచారం అందిచవలసిందిగా కోరారు…
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.
News
ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ (RDO) కె. అరుణాదేవి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ నయూమ్, అసిస్టెంట్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది, బీజేపీ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 26834 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 23290 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 2266 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.852 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ
ఆదోని, ఆగస్టు 12: ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరుపై న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News3 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News4 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News6 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
News2 days ago
వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ
-
News4 weeks ago
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి