Day: June 9, 2024

ధనాపురంలో కూటమి పార్టీ విజయోత్సవలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామ ప్రజలు సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలతో నాయకులు కార్యకర్తలతో కలిసి మీనాక్షి నాయుడు కేకు కట్ చేశారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదోని నియోజకవర్గంలో ప్రజలు భారీ ఎత్తున బాణ సంచాలు కాల్చి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవ సంబరాలు ఘనంగా జరుపకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పెద్ద హరివనంలో కూటమి పార్టీ విజయోత్సవ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించి నందుకు గ్రామంలో అన్ని దేవస్థానమునకు టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొని మాన్వి దేవేంద్రప్పకు శాలువాల కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version