ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాలతో ఖాజీపుర సమస్యలపైన దృష్టి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని 14వ వార్డు ఖాజీపురా కాలనీ వాసులు కలిసి సమస్యలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి బిజెపి నాయకుడు మధుసూదన శర్మను ఖాజీపురా కాలనీకి వెళ్ళి సమస్యలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయమని ఆదేశాలు ఇవ్వడంతో. మధుసూదన శర్మను అక్కడున్న డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్, సమస్యలు చాలా అద్వాన్నస్థితిలో ఉన్న విషయాలను గుర్తించి కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మధుసూదన శర్మను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి సమస్యలను తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే ఫోన్ చేసి వెంటనే ఖాజీపురా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించరు. ఈ కార్యక్రమములో మహబూబ్ బాషా, తాహెర్ భాషా, ఇబ్రహీం , వలి, ముస్లిం మైనారిటి మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version