కర్నూలు జిల్లా అదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.  ఆయా పార్టీలు జేఏసీ గా ఎర్పడి డోల్చ పైహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వాక్ఫ్ భూములను దోచుకోనేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిం చారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వాక్ఫ్ బోర్డ్ బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలోని చంద్ర బాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీహర్ సీఎం నితీష్ కుమార్ రాబోవు రోజుల్లో మూల్యం చెల్లించు కోక తప్పదని హెచ్చరించారు.

నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు
నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు
నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *