కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుంబలం గ్రామములోని కంబయ్య కట్ట వద్ద అక్రమంగా కర్ణాటక మధ్యన తరలిస్తున్న గవిగట్టు గ్రామంనికి చెందిన ఉప్పర మహాదేవప్ప అనే వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ పై 2 బాక్సులు 182 (90ml) టెట్రా ప్యాకెట్ లను నీ తీసుకొని వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి టెట్రా ప్యాకెట్ మరియు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ సీజ్ చేసి రిమాండ్కి తరలించారు.
భార్యను చంపిన భర్త
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కిల్చినపెట్ లో దారుణం చోటుచేసుకుంది. భర్త చంటి భార్య శిరీష (22) గొంతు నులిమి హత్య చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేసినట్లు భర్త చంటి పోలీసులకు తెలిపాడు. 1 టౌన్ పోలీసులు హత్యపై పూర్తి వివరాలు సేకరిస్తున్నరు.
ఇంటి పట్టాల పంపిణీ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇందిరా నగర్, బండేమెట్ట వార్డు ప్రజలకు 135 ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 2100 రూపాయలు కట్టి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చలపతి కౌన్సిలర్ చిన్న మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పాల్గొన్నారు.
