కర్నూలు జిల్లా ఆదోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ముందు బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మార్చ్ 24 25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కె. రవికుమార్, ఆర్ రాజశేఖర్, NCBE నాయకులు మరియు నాగరాజు, హరినాథ్, గాయత్రి AIBEA నాయకులు మాట్లాడుతూ అన్ని బ్యాంకులలో పని ఒత్తిడి తగ్గించేందుకు తగిన స్థాయిలో నియమకాలు చేపట్టాలని ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని అవుట్ సోర్సింగ్ పై ఉద్యోగ నిమకాలను బంద్ చేయాలని కోరారు. వివిధ డిమాండ్లను సాధించుకునేందుకు చేపట్టిన రెండు రోజుల బ్యాంకు సమ్మెను అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పనిచేసే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఏ నాయకులు ఏఐబిఓసి నాయకులు NCBE నాయకులు పాల్గొన్నారు.



