ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి నిరసన

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి  గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు అయ్యప్ప, శాఖ కార్యదర్శి నాగరాజు, పార్టీ సభ్యుడు వెంకటేష్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version