ఆదోని (ఆగస్టు 20): కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 22 (శనివారం), 23 (ఆదివారం) తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు / అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) మరియు 284 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ శిబిరాల ద్వారా ప్రతి బూత్ స్థాయి అధికారి సంబంధిత అనామలీ (Anomaly) పత్రాల డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు, అలాగే వివిధ రాజకీయ పార్టీల ద్వారా నియమితులైన బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఓటరు నమోదు అధికారి విజ్ఞప్తి చేశారు.