కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదోని మండలం పెద్ద హరవాణం గ్రామం లో కార్డెన్ సర్చ్ చేసి ఎలాంటి ధ్రువపత్రాలు చూపని ఆరు మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో ఆదోని డిఎస్పి జె శివ నారాయణ స్వామి, తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్, ట్రాఫిక్ సీఐ పార్థసారథి, పిసిఆర్ సీఐ మంజునాథ్, రూరల్ ఇస్వీ ఎస్సై ఎల్ విజయలక్ష్మి ఎస్సై గోపాల్ రెడ్డి, పెద్ద తుంబలం ఎస్సైపీరయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.



