అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు ఆదోని మండలం హానవోలు గ్రామంలో డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో విస్తృతంగా ఇళ్ళల్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిలువఉంచిన 236 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ఒక స్కూటర్ మరియు సరైన ధ్రువపత్రాలు లేని 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి, పెద్ద తుంబళం ఎస్సై పీరయ్య, ఇస్వి ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.