కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న హరివణం, చిన్న గోనెహళ్, సంతే కుడ్లూరు, బలదురు, ఎడవల్లి, పెద్ద హరివాణం, హనవాళ్, జి. హోసల్లి,కడితో ట, ఇస్వి, బసాపురం, చాగీ, నారాయణ పురం, దనపురం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీర రెడ్డి, మండల నాయకులు శేఖర్, తిక్కప్ప, శాఖా కార్యదర్శులు రామాంజనేయులు, శ్రీనివాసులు, లక్ష్మన్న, పార్టీ సభ్యులు రహిమాన్, హుస్సేని, ఉరుకుందు, హనుమంత రెడ్డి పాల్గొన్నారు.

