
APWJF ఆదోని డివిజన్ శాఖ ఆధ్వర్యంలో APWJF 19 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక R & B గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి TG ప్రసాద్ , జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి TG ప్రసాద్ APWJF జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి , జర్నలిస్టుల హక్కుల సాధన కోసం
నవంబర్ 5 2007 లో ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో APWJF ఆవిర్భవించినప్పటి నుండి నిరంతరం జర్నలిస్టుల కోసం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ డివిజన్ లోని సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి , జర్నలిస్టుల హక్కుల సాధనకై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆదోని APWJF అధ్యక్షులు చంద్ర మోహన్ , సెక్రటరీ మురళి కృష్ణ , ట్రెజరర్ రమేష్ రెడ్డి , గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు , ఉరుకుందప్ప , శంషీర్ ఖాన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.