Magazine Stories
ఆలూరు రాజకీయాల్లో మారుతున్న ముఖచిత్రం

- ఒక్క అవకాశం కోసం… తెర్నేకల్లు సురేందర్ రెడ్డి
- దశాబ్దకాలంగా ఎదురుచూపులు
- పార్టీ స్థాపితం నుండి పార్టీ జెండా మోసినా జరగని న్యాయం
- ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులు
- కుడా చైర్మన్ పదవి ఖరారైనా దక్కని అవకాశం
- 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ కోసం ప్రయత్నాల్లో తెర్నేకల్లు సురేందర్ రెడ్డి
ఆలూరు ప్రత్యేక ప్రతినిధి : కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో వైకాపాలో ఆసక్తికర రాజకీయ చదరంగాలు బయట పడుతున్నాయి… దశాబ్దకాలంగా ఎదురుచూపులు చూస్తున్న తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ జెండా మోసినా జరగని న్యాయం అని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు, ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులను జయించి ఈ సరైన 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ సురేందర్ రెడ్డికి దక్కేనా.. ? అని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే ప్రయత్నంలో వైకాపా అధిష్టానం ఉన్నట్లు జోరుగా జిల్లాలో ప్రచారం సాగుతున్నది, దీనితో ఆ నియోజకవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు టికెట్ కోసం ముమ్మార ప్రయత్నాలు సాగిస్తున్నారు, దేవనకొండ మండలానికి చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఇటీవలే టిడిపిని వదిలి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు అయితే కొంతమంది వైకాపా పెద్దలు ఆలూరు టికెట్ తనకు ఇప్పిస్తామనె హామీతో పార్టీలో తను చేరినట్లు నియోజక వర్గంలో ప్రచారం జరుగుతున్నది, వీరితోపాటు చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు బలంగా ప్రచారంలో ఉంది, మంత్రి జయరాంతో ఆయనకు ఉన్న విభేదాలతో ఇటీవలనే పార్టీ వీడే ఆలోచనలో ఉన్న విరుపాక్షిని కొంతమంది వైకాపా పెద్దలు సర్దిచెప్పి పార్టీలో కొనసాగితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లు సమాచారం, దీంతో ఆయన ఎలాగైనా పోటీచేయాలనే ఆలోచనతో కొంతమంది వైకాపా ముఖ్య నేతలతో టికెట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది, మాజీ ఎమ్మెల్యే తెర్నేకల్లు నీరజా రెడ్డి కుమార్తె హిమ వర్షిత రెడ్డి కూడా వైకాపా తరపున పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే స్థానిక వైకాపా నేతలు టిడిపికి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి స్థానిక నేత అయితే బాగుంటుందనె ఆలోచనతో వైకాపా రాష్ట్ర సీనియర్ నాయకులు తెర్నేకల్ సురేందర్ రెడ్డిని పోటీలో నిలబెడితే గెలుపుకు సులభంగా ఉంటుందనె ఆలోచనతో రెడ్డి సామజికవర్గానికి చెందినా పెద్దలు అనుకుంటునట్లు తెలుస్తుంది, స్థానిక వ్యక్తి కావడం, అలాగే జే.సి.యస్ కర్నూల్ జిల్లా కో ఆర్డినేటర్ గా ముఖ్య పదవిలో ఉండటం వల్ల పార్టీ క్యాడర్ కు అనుకూలంగా విజయానికి కూడా సులువు అవుతుందని తెర్నేకల్ సురేందర్ రెడ్డి అయితేనే సరైన అభ్యర్థి అనే ఆలోచనతో స్థానిక వైకపా నేతలు నియోజక వర్గ ముఖ్య నాయకులతో జోరుగా మంతనాలు కొనసాగిస్తున్నారు, సురేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా తిరుగుతూ పార్టీ నాయకులను కలుస్తూ వాళ్లకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నారు, నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులు వైసిపి అధిష్టానంలో ఉన్న ముఖ్య నాయకులతో బేటి అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది, తెర్నేకల్ సురేందర్ రెడ్డికి పార్టీ టికెట్ కోసం స్థానిక నేతలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కప్పట్రాల వెంకటప్ప నాయుడుకి దేవనకొండ మండలంలో ప్రత్యేక వర్గం ఉన్నప్పటికీ వారంతా టిడిపిలో పాతుకొని పోవడం బొజ్జమ్మ వైకాపాలో చేరిన కూడా తన వెంట ఎవ్వరు రాకపోవడంతో ఒకవేల టికెట్ ఇచ్చిన గెలుపుకు కష్టతరం అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు, అంతే కాకుండా తన ప్రత్యర్థి అయిన మద్దిలేటి నాయుడు అదే పార్టీలోనే ఉన్నారు, బొజ్జమ్మ కు టికెట్ ఇస్తే ఎంతవరకు సహకరిస్తారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు, బొజ్జమ్మకు ఆలూరు నియోజకవర్గం లో సరైన మద్దతు లేనట్లు కనిపిస్తుంది, మంత్రి సామాజిక వర్గానికి చెందిన చిప్పగిరి జడ్పీటిసి విరుపాక్షి కి టికెట్ ఇచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం ఎంతవరకు సహకరిస్తారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షి మంత్రి గుమ్మనూరుకు తీవ్రస్థాయిలో విభేదాలు ఉండడంతో గుమ్మనూరు జయరాం వర్గం అందుకు వ్యతిరేకంగా పనిచేయదా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, ఇక మాజీ ఎమ్మెల్యే నీరజ రెడ్డి కుమార్తె హిమ వర్షిత రెడ్డి కి ఇప్పటి వరకు ఆలూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి, ప్రజలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఇప్పుడు వచ్చి ఓటు వేయమని అడిగితే ప్రజలు సహకరిస్తారా అని ఓటర్లు గుసగుసలాడుతున్నారు, వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గట్టి పోటీగా తెర్నేకల్ సురేందర్ రెడ్డిని పోటీలో నిలబెట్టినట్లయితే ఆలూరు లో మరోసారి వైకాపా జెండా ఎగరవేయగలమని స్థానిక ముఖ్య నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతూ… తన సామాజిక వర్గానికి చేసిందేమి లేదని అందువల్లనే తన సామాజిక వర్గతో పాటు ఇతర బి.సి వర్గానికి చెందినా వారు కూడా ఇప్పుడు సహకరిస్తారో…? లేదో….? అనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే తరుణంలో టిడిపి తరఫున రెడ్డి సామాజిక వర్గనికి చెందిన కోట్ల సుజాతమ్మ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది, వైకాపాలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపితే గెలుపు సులభమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
Magazine Stories
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్ పొందారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన “ఇండియాస్ ఎగ్‌స్టార్ట్ ట్రెండ్‌స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్-స్టెయిన్డ్ గ్రోత్” (క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్, 1964) అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక డెల్హీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో పని చేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యలను పెంచుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారత దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రజా సేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేమ్బ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్న్మెంట్ మీటింగ్ (సైప్రస్), 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌కు ఆయన నాయకత్వం వహించారు.
పోలిటికల్ కెరీర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
2004 జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు.
2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు.
*మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలు..!
1) 1991 ఆర్థిక సంస్కరణలు
2) సమాచార హక్కు చట్టం, 2005
3) NREGA (ఇప్పుడు MGNREGA)
4) ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008
5) విద్యా హక్కు చట్టం, 2009..
6) జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013
7) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM)
8) అధిక GDP వృద్ధి రేటు..
9) బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు..
10) పటిష్టమైన విదేశాంగ విధానం.
Magazine Stories
సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?
కర్నూలు జిల్లా:
సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందేనా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?

సోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు.

అంతెందుకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట కు చెందిన సుధారాణిపై, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనంతపురం జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన జె. రామాంజనేయులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసు నమోదు చేశారు.
ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయ్యింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది అసభ్యకర పోస్టులే. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ లపైనా కేసులు నమోదయ్యాయి.

డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కోర్టులో ఓ పిల్ వేయగా..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేము అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పు లేదు. హద్దులు దాటి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇంతకీ సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా?
Magazine Stories
మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.
★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న నా ప్రయత్నం.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్

తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఒక టైర్ పంచర్ రిపేర్ షాప్ ఓనర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అన్ని సార్లు ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటివరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు చివరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్ 6 వైస్ ప్రెసిడెన్షియల్ 32 లోక్సభ 50 రాజ్యసభ 73 పార్లమెంటరీ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు.

ఇతను వాజ్పేయ్, పివి నరసింహారావు, జయలలిత, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, మోదీ ఇలా ఎంతో మంది ప్రముఖుల మీద పోటీ చేశాడు. అయితే ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయలి ఆ నగదును తన టైర్ పంచర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఎలక్షన్ నామినేషన్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు సుమారుగా 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట.

ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నా కానీ ఒక్కసారి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు నామినేషన్స్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకుంటారట మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇతను ఇలా పోటీ చేస్తున్నాడట ఓడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ కాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.


-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర