Connect with us

News

ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు

Published

on

దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగి
పంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో దుబాయికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆర్థికంగా స్థిరపడాలని అనుకునేవాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద్ అనే ఏజెంట్ ఇమ్రాన్ ను కలిసి దుబాయిలో నెలన్నర రోజులు పాటు సెంట్రింగ్ పనులు చేస్తే రూ.2 లక్షలు జీతం వస్తుందని చెప్పాడు. దీనికి ఇమ్రాన్ ఒప్పుకున్నాడు. అప్పు చేసి ఏజెంట్ సయ్యద్ ద్వారా 2023 మార్చి 30వ తేదీన దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ తనను గదిలో పెట్టారన్నారు. 45 రోజులు గడిచినా తనను పనికి పంపించలేదన్నారు. అక్కడి వారు ఓ కాగితం తీసుకొచ్చి, నీ పేరుపై తాము బ్యాంకు క్రెడిట్ కార్డు
ద్వారా రుణాలు తీసుకుంటామని, సంతకం చేస్తే చాలని వేధిస్తున్నారన్నాడు. తాను సెంట్రింగ్ పనుల కోసం వెళ్తే.. ఇలా రుణాల కోసం సంతకం చేయ మని వేధిస్తున్నారని, గదిలో నుంచి బయటకు కూడా పంపడంలేదని వాపోయారు. తను పాస్పోర్టు, వీసా సైతం తీసుకున్నారని. కేంద్ర ప్రభుత్వం, దుబాయిలోని అంబసీ వారు స్పందించి తనను దుబాయి నుంచి భారతదేశానికి పంపించాలని కోరారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

Published

on

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో

​కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ (RDO) కె. అరుణాదేవి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ నయూమ్, అసిస్టెంట్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది, బీజేపీ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 26834 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 23290 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 2266 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.852 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ

Published

on

ఆదోని, ఆగస్టు 12: ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.

ఆదోని జ్యుడీషియల్ కోర్ట్ ఫోటో

​ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరుపై న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెండవ అదనపు జడ్జి బోర్డు
Continue Reading

Trending