News
ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల
రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల టిడిపి ఏపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి. గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ గడ్డా ఫకృద్దీన్ హర్షం వ్యక్తం చేసారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గడ్డా ఫకృద్దీన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి వారిలో ఆనందం నింపారని తెలిపారు.ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి ఎంతో సంతోషం కలిగించిందని, కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అధికశాతం ముస్లిం సోదరులు అభిప్రాయపడుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, ఉపవాసం ఆచరించే వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారికి సమయం ఇచ్చారని గడ్డా ఫకృద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫారూఖ్ లకు గడ్డా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
