Connect with us

News

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు

Published

on

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్  బి. నవ్య పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో  శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత  అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని అర్హులైన వ్యక్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.  సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటివరకు 1474 జాయింట్ ఎల్పిఎంలు గుర్తించగా, కేవలం 309 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు పూర్తిచేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం

65 సంవత్సరాలు పైబడినవారికి మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులను జూన్ 25 నుండి 30వ తేదీ లోపు డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. డోర్ డెలివరీ ప్రక్రియలో ఎంతమందికి సరుకులు అందించామో, ఎంతమందికి అందించలేకపోయామో వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌలు రైతు కార్డులపై కూడా సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆదోని డివిజన్లో 10,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 1,100 కార్డులే నమోదు అయ్యాయని తెలిపారు. జూలై 15వ తేదీ లోపు రీన్యూవల్ మరియు కొత్త దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజును ఆదేశించారు.
     ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డివిజన్లోని తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, గంగిరెడ్డి, ఆదోని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య అధికారులతో సమీక్ష సమావేశం
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని , NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు టర్నింగ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన పై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణంఅని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులు
Continue Reading

News

ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి

Published

on

ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

మానసికరం చేస్తున్న నూతనంగా ఎన్నికైన రెవెన్యూ శాఖ అధికారులు

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:

  • ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
  • అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
  • సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
  • ట్రెజరర్: రాఘవేంద్ర
  • వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
  • జాయింట్ సెక్రటరీ: మహేష్
  • ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
  • స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య
ఎన్నికల నిర్వహిస్తున్న ఫోటో

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఎన్నికైన అధికారుల గ్రూప్ ఫోటో
Continue Reading

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading
News2 weeks ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News2 weeks ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News2 weeks ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News2 weeks ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News4 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News2 weeks ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News1 week ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News2 weeks ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News4 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News2 weeks ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

Trending