News
మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..

మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..
తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు..
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ 10 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న దళిత మహిళా మాలజయలక్ష్మి షెడ్డు ని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో నిత్యానందయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి అండగా నిలబడి రాష్ట్రంలో మాలమహానాడు తరఫున ర్యాలీలు ధర్నాలు చేసి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చంద్రయ్య మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షులు జైభీమ్ సాయిరామ్, రాయలసీమ అధ్యక్షులు ఎం నరసప్ప , నందవరం మాల మహానాడు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆదోని మండల యూత్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజోలప్ప మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్మాల మహానాడు నాయకులు బన్నూరు అంజి నీలకంఠ ఎల్లప్ప హుసేని గిరి తదితరులు పాల్గొన్నారు.
News
వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు మొదటి నుండే ఇష్టం లేదని అనూష , శాంతరాజ్ ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలైనా పెళ్లైనప్పటి నుండి అత్తమామలు తిక్కయ్య , లలితమ్మ తో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా అదనపు కట్నం కోసం ఆమెను వేదిస్తున్నాడని కలత చెందిన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేశారు. తల్లితండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష

కర్నూలు జిల్లా ఆదోని లో ముద్దాయి కురువ నాగేష్ కు హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1,500/- లు జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించారు రెండవ అదనపు జిల్లా జడ్జ్ టి.జె. సుధా. మద్యానికి బానిసై పనికి పోకుండా తిరుగుతుండడంతో భార్య జయలక్ష్మి పనికి పొమ్మని మందలించదాంతో 20.02.2024 నాగేశ్ రాత్రి అందరూ నిద్ర లో ఉన్నపుడు గొడ్డలితో భార్య కురువ జయలక్ష్మీని నరికి హతమార్చిడు. ఘటనకు సంబందించి కురువ జయలక్ష్మీ తండ్రి కురువ యల్లప్ప ఫిర్యాదు మేరకు Cr.No. 27/2024 U/Sec 498 (a), 302 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు దీనిపై విచారణ జరిపిన రెండవ జిల్లా అదనపు కోర్టు గురువారం తీర్పును వెల్లడైంది.
పెద్దకడుబూరు SI P. నిరంజన్ రెడ్డి కేసుకు సంబందించిన సాక్షులను క్రమం తప్పకుండా వాయిదాలకు కోర్టులో హాజరు అయ్యేలా చూసి, ముద్దాయికి శిక్ష పడేలా చేశారు. అన్ని కోణాల్లో విచారించిన ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1500/- లు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, పెద్దకడుబూరు పోలీసులను, కోర్టుమానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందనలు తెలిపినట్టు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

News
అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రై మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్
సెంట్రల్ స్కీం ద్వారా 63 లక్షలతో ZP పాఠాశాల అదనపు గదులకు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా 10 లక్షలతో గ్రామములో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామంలోనే కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో స్కూలకు అదనపు గదులకు పనులు త్వరలో చేపడతామని స్కూళ్లలో విద్యార్థుల అధికంగా ఉండడంతో టీచర్లు లేరని దానికోసం ప్రభుత్వంతో మాట్లాడి విద్య వాలంటీర్లు టీచర్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర