వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో  వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు మొదటి నుండే ఇష్టం లేదని అనూష , శాంతరాజ్ ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలైనా  పెళ్లైనప్పటి నుండి అత్తమామలు తిక్కయ్య , లలితమ్మ తో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా అదనపు కట్నం కోసం ఆమెను వేదిస్తున్నాడని కలత చెందిన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేశారు. తల్లితండ్రుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఆదోని ఏరియా హాస్పిటల్ లో మృతురాలి బంధువులు
మృతురాలి తండ్రి హనుమంతు మాట్లాడిన వీడియో