Connect with us

News

DYFI ఆధ్వర్యంలో పాండవగల్లు బస్టాండ్ వద్ద రాస్తారోకో

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం నుండి ఎరిగేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తక్షణమే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ (DYFI) డిమాండ్ చేస్తూ మంగళవారం పాండవగల్లు బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్థులు, నాయకులతో కలసి రాస్తారోకో నిర్వహించారు.

రాస్తారోకోతో నిలుబడిపోయిన వాహనాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ… పాండవగల్లు గ్రామం నుండి ప్రతినిత్యం సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఎరిగేరి హైస్కూల్‌కు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అయితే, ఈ రూట్లో వెళ్లే ఉరుకుంద, కౌతాళం తదితర బస్సులు గ్రామంలో ఆపకుండా వెళ్ళిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుర్హున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 13వ తేదీ నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా విద్యార్థులు మరీంత అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాండవగల్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, మంజు, భాష, వీరాంజి, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

పార్థసారథి పై రైతు సంఘం నేతల ఘాటు వ్యాఖ్యలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల ఆందోళన

Published

on

కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలసికట్టుగా ఈ ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు ఎటువంటి సుంకం లేకుండా దిగుమతి అయి, దేశీయంగా పంటల ధరలు పడిపోతున్నాయని.. ◆ అదే సమయంలో మన ఉత్పత్తుల ఎగుమతులపై 25% సుంకం విధించడంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ◆ ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతీ రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ◆ కార్పొరేట్ సంస్థల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, రైతులపై కనికరం చూపకపోవడం దారుణమన్నారు. ◆ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ◆ ‘విబిసి రామ్‌జీ’ చట్టంతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి దూరం చేస్తున్నారని విమర్శించారు.

పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులు

◆ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, తుంగభద్ర నీరు సముద్రంపాలవుతున్నా శ్రీశైలం-హోస్పేట్ మధ్య కనీసం ఒక్క డ్యామ్ కూడా నిర్మించకపోవడం శోచనీయమన్నారు. ఆలూరు, ఆదోని ప్రాంతాలకు నీరందించే వేదవతి, గుండ్రేవుల, RDS ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆదోని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రజలు చెంబులు-బిందెలతో నిరసన తెలుపుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ◆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మెడికల్ కాలేజీ, ఆటో గ్యారేజ్, మాస్టర్ ప్లాన్ అమలును వెంటనే పూర్తి చేయాలని, చిల్లర రాజకీయాను మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్షాలు

​ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా కంటితుడుపు రాజకీయం మాని, రైతులు, కార్మికులు మరియు ఆదోని ప్రాంత అభివృద్ధి సమస్యలపై తక్షణమే స్పందించాలని.. లేనిపక్షంలో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.

Continue Reading

Trending