◆ గాడిద పాలు.. మేక పాలు.. దోశల వేలం.. ఇదేనా ఆదోని అభివృద్ధి? ◆ ఎమ్మెల్యే పరుగులపై సాయి ప్రసాద్ రెడ్డి సెటైర్లు.. “పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్టుంది” ◆ ఆదోని అభివృద్ధిపై సాయి ప్రసాద్ రెడ్డి ఫైర్.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..
డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తీరుపైనా ఘాటుగా స్పందించారు. పోలీసులు వెంటపడుతుండగా రోడ్డుపై ఎమ్మెల్యే పరుగులు తీయడం చూస్తుంటే పిచ్చాసుపత్రి నుంచి బయటకు పారిపోతున్నట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఆదోనికి జరిగిన అభివృద్ధి ఏమిటని అంటే గాడిద పాలు, మేక పాలు తాగడం.. లిక్కర్ డాన్లతో పూరీలు, దోశలు వేలం వేయడం మాత్రమే అభివృద్ధిగా మిగిలిపోయిందని విమర్శించారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి విమర్శించారు.