News
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 10.07.2024

కర్ణాటక: తుంగభద్ర:
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1602.67 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 25.173 టీఎంసీలు
News
ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల టిడిపి ఏపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి. గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ గడ్డా ఫకృద్దీన్ హర్షం వ్యక్తం చేసారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గడ్డా ఫకృద్దీన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి వారిలో ఆనందం నింపారని తెలిపారు.ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి ఎంతో సంతోషం కలిగించిందని, కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అధికశాతం ముస్లిం సోదరులు అభిప్రాయపడుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, ఉపవాసం ఆచరించే వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారికి సమయం ఇచ్చారని గడ్డా ఫకృద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫారూఖ్ లకు గడ్డా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
News
ముఖ్యమైన వార్తలు

15వ తేదీ శనివారం ఫిబ్రవరి 2025 నలుదిక్కుల ముఖ్యమైన వార్తలు..
◆ రాజమండ్రిలో నకిలీ కరెన్సీ పట్టివేత ఐదుగురి అరెస్ట్ కోటి రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం..
◆ సూర్యాపేట జిల్లా బొజ్జ గూడెం లో కూలీల ఆటో బోల్తా పదిమందికి గాయాలు
◆ జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతాలు.. ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలు లక్ష్మి.. పవన్ కళ్యాణ్ అండతోనే రెచ్చిపోతున్నారని లక్ష్మీ ఆరోపణ..
◆ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు..
ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి లత..
అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోహణంలు..
◆ ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి..
ప్రజల తరఫున పోరాటం చేస్తామన్న ఎమ్మెల్సీ కల్పిత..
◆ భక్తజన కేంద్రంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ.. పుణ్యస్నానాలు ఆచరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
◆ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన డికే అరుణ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ..
◆ మోడీపై మాట్లాడితే గొప్ప వాలం అవుతం అనుకుటున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు..
◆ ఇవ్వాలి ఇవాళతో ముగియనున్న మస్తాన్ సాయి కస్టడీ..
కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు..
◆ నారాయణపేట జిల్లా మక్తల్ లో ఘరానా మోసం షేర్ మార్కెట్ పేరిట 100 కోట్లు దండుకున్న సేటుగాడు.. నెల్లూరు జిల్లా కావలిలో పట్టుబడ్డ సుభాని..
◆ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఆక్రమణల కూల్చివేత.. అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన జిహెచ్ఎంసి అధికారులు..
◆ ప్రకాశం జిల్లా కంభం లో దారుణం.. కొడుకును ముక్కలుగా నరికి చంపిన తల్లి.. సంచుల్లో పెట్టి కాలువలో పడేసిన సాలమ్మ..
◆ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం.. కాంటాక్ట్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన..
◆ అల్లూరి జిల్లా వేలువాయిలో గిరిజనుల నివాసాలు కూల్చివేత.. పట్టా భూముల్ని ఆక్రమించారని నిర్మాణాలకు తొలగింపు.. ◆తమిళనాడులో ఈనెల 28న ప్రధాని మోడీ పర్యటన.. రామేశ్వరంలోని న్యూ పోమ్బన్ బ్రిడ్జ్ కు ప్రారంభోత్సవం..
◆ యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న బొలెరో వాహనం పదిమంది మృతి.. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఘటన..
◆ యూపీ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి మురుమన్ దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి..
◆అక్రమ వలసదారులపై అమెరికా కొరడా.. మరో 119 మంది భారతీయుల తరలింపు..
◆ వలస విమానాలు పంజాబ్లో ల్యాండింగ్ పై వివాదం.. భారత్ పరువు తీస్తున్నారు అన్న సీఎం భగవంత్ మాన్..
◆ డాలర్ విలువను తగ్గించాలని చూస్తే 100% ట్యరీప్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక..
◆ బంగారం ప్రియులకు భారీ ఊరట.. 10 గ్రాముల పై 1100 రూపాయల తగ్గుదల..
◆ 2007 తర్వాత తొలిసారి లాభాలలో బిఎస్ఎన్ఎల్ క్యూ3 లో 262 కోట్లు లాభాలు..
News
విద్యార్థులకు అవగాహన సదస్సు

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ స్వచ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఫిబ్రవరి మూడో శనివారం రోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అక్షర శ్రీ స్కూల్, ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త హానికారి చెత్త వేరు చేయడం పై మున్సిపల్ కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు శుభ్రత వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, రంజల రోడ్డు పలుచోట్ల మున్సిపల్ కమిషన శానిటేషన్ పనులను పర్యవేక్షించరు.



-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర