Connect with us

News

చేనేత కార్మికులకు మగ్గము, పరికరాల పంపిణీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ 40వ వార్డులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఆదోని క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో మంజూరైన నిధులతో చేనేత మగ్గము, ఇతర చేనేత పరికరములు చేనేత కార్మికులకు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా 80,546 చేనేత కార్మికులకు వైయస్సార్ నూతన నేస్తం పథకం ద్వారా రూ. 24 000/- చొప్పున ఐదు సంవత్సరాలుగాను రూ 1.20 వేలు అందించడం జరుగుతుంది గత చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినాడు గత రాజశేఖర్ రెడ్డి హయం నుంచి నిరుపేద చేనేత కార్మికులకు గుర్తింపు కార్డు మంజూరు చేయించి పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, చేదోడు వైయస్సార్ చేయూత అన్ని పథకాల కూడా నేరుగా డబ్బులు వారి అకౌంట్లోనే వేయడం జరుగుతుంది అని తెలిపారు. 2024 లో కూడా కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇది ప్రజల ప్రభుత్వం అలాగే ఆదోనిలో టీడీపి నిరుద్యోగ నాయకులు టిడ్కో గృహాలపై విమర్శలు చేయడం సరికాదు మొదటి విడత టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ తాళాలు అప్పగించడం జరిగింది త్వరలో చిన్నపాటి సమస్యలు ఉన్న సర్దుబాటు చేసి గృహాలకు చేరుస్తాం కచ్చితంగా నా ఆదోని ప్రజలకు గృహాలను అప్పగించి తీరుతా నా ఆదోని ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అన్నారు. ఈరోజు చేనేత కార్మికులకు మగ్గం వేయడానికి యంత్ర పరికరాలను అప్పగించడం జరిగింది త్వరలో చేనేత కార్మికులకు 3 సెంట్లు నివాస స్థలమును ఇవ్వడానికి కృషి చేయాలని కలెక్టర్ కు విన్నపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, చేనేత శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జి.రాజారావు, చేనేత శాఖ సహాయ సంచాలకులు హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తాసిల్దార్ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

News

వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర  , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే  భోజనం చేశారు.

మహాగౌరి ఫ్యాక్టరీ

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి  కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర  మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్న ఫోటో
మృతుడు మాల రాఘవేంద్ర ఫైల్ ఫోటో
Continue Reading

Trending