పేద ప్రజలను ఇబ్బంది పెడితే హాస్పిటల్ పై చర్యలు తప్పవు

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 5 లక్షలు రూపాయల వరకు అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి మించి ఖర్చు వచ్చిన ఆరోగ్యశ్రీ లేదు అన్న వారు తాము హాస్పిటల్లో ఖర్చుపెట్టిన సరైన డాక్యుమెంట్స్ ఇస్తే సీఎం క్యాంప్ కార్యాలయం కి ఎమ్మెల్యే ద్వారా పంపిస్తే వారం పది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయని తెలిపారు. ఆదోనిలో కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్న ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మళ్ళీ ఆరోగ్యశ్రీలో పెట్టి అక్కడ కూడా డబ్బులు తింటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పేద ప్రజల వద్ద ఆరోగ్యశ్రీ లేదని మాయమాటలు చెప్పి ఎవరైనా డబ్బులు వసూళ్లకు పాల్పడి పేద ప్రజలకు ఇబ్బంది పెడితే అటువంటి వారిపై విచారించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version