Connect with us

News

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇక లేరు

Published

on

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.
విలువలతో కూడిన జర్నలిజానికి పర్యాయ పదంగా, అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరువలేనిది! జీవితాంతం ప్రజల పక్షాన అక్షరాన్ని నిలిపి..ప్రజా పరిరక్షనకు పాటుపడిన రామోజీరావు గారి మరణం తీరని లోటు.

News

13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ  స్వాధీనం చేసుకున్నరు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వాధీనం చేసుకున్న నగదును వివరిస్తున్న డి.ఎస్.పి సీఐ
మీడియా ముందు నగదును ప్రదర్శించిన ఎస్పీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్
Continue Reading

News

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

Published

on

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం  తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

Published

on

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది.

మృతురాలు మౌనిక

బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీసుకుతుండగా కూతురు మౌనిక అడ్డుకొని డబ్బు తీసుకున్న విషయం నాన్నమ్మ కు చెబుతానని చెప్పడంతో తాగిన మత్తులో దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని తాడుతో గొంతు బిగించి హత్య చేశాడని బంధువులు తెలిపారు.

ఏరియా హాస్పిటల్ వద్ద మృతురాలి బంధువులు

పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు వీరేశ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పోస్టుమార్టం రూమ్ వద్ద బంధువులు
Continue Reading

Trending