Connect with us

News

ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …

Published

on

వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.
మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారికి సహకరించండి. మీ యొక్క కష్టార్జితాన్ని దొంగల పాలు కాకుండా కాపాడండి. పట్టణంలో దొంగతనాలు జరగకుండా పోలీసు వారితో కలిసి భాగస్వామ్యం కండి అని పిలుపునిచ్చారు ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ.

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

Trending