News
హాస్య నటుడు మనోబాల(69) ఇక లేరు..
బహుముఖ నటి మనోబాల(69) బుధవారం తుది శ్వాస విడిచారు. మనోబాలకు రజనీకాంత్ కమలహాసన్ సుహాసిని తదితరుల సినీ నటులు చిత్ర నిర్మాతలు నివాళులర్పించారు
మనోబాల అపోలో హాస్పిటల్ లో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస వదిలారు. తన సొంత సాలి గ్రామంలో నీ తన సొంత నివాసానికి తరలించారు.
మనోబాల హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన దర్శకునిగా కూడా రాణించారు ఆయన దర్శకత్వంలో రజినీకాంత్ సుహాసిని ప్రభు రాధిక సత్యరాజ్ శివాజీ గణేషన్లకు కూడా పనిచేశారు.
అతని ప్రసిద్ధి సినిమాలలో ఊర్కవలన్, ఎన్ పురుషంతన్ ఎనక్కు మట్టుమ్తాన్, మరియు ధూరతు పచ్చైలు.. ధనుష్, సూర్య, విజయ్, కార్తీ మరియు జయ రవి వంటి తమిళ సినిమా ప్రముఖ నటులతో కూడా మనోబాల స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. బాగా పేరుపొందిన
పాత్రల్లో యారడి నీ మోహిని, సిరుతై, మరియు నన్బన్ మంచి పేరు వచ్చింది. మనోబాల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ, భారీ ప్రభావాన్ని చూపించారు మరియు విస్తృత ప్రజాదరణ పొందాడు. మనోబాల దర్శకత్వం వహించిన ఊర్కావలన్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించారు, తన ప్రియమైన స్నేహితుడి మృతికి సంతాపాన్ని తెలియజేసేందుకు
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


