నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు

కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు.

ఎమ్మిగనూరు సర్కిల్ లో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

ఈ సందర్భంగా డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ మొద్దు నిద్రలో ప్రభుత్వ విద్యా అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది విద్యార్థులు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చేటప్పుడు రోడ్డు దాటే సమయంలో విద్యార్థులు కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు! స్థానిక వార్డెన్ బాధ్యత వహిస్తారా? బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారా? లేదా ప్రభుత్వ విద్యా అధికారులు బాధ్యత వహిస్తార అని ప్రశ్నించారు. కరువు ప్రాంతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వలసలకు వెళ్తూ తమ పిల్లలు చదువులు పాడవకుండా హాస్టల్ లో ఉంటే బాగా చదువుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారు అయితే ప్రభుత్వ అధికారులు వారి కళలును నిజం చేసే విధంగా పనిచేయకుండా విద్యార్థులతో బయట నుంచి నీళ్లు మోయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రధాన నీటి సమస్యలు పరిష్కారం చూపాలని సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థులకు హాస్టల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి తగిన న్యాయం చేయాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ DSF విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు వరుణ్, విక్రమ్, కిరణ్, వినీల్, రాజ్ కుమార్, చరణ్, సుకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top