అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి ఆర్థిక సాయం..

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామానికి చెందిన తూటాని ఈరమ్మ గత కొంతకాలంగా పక్షవాతానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బాధితురాలికి తక్షణ సాయంగా రూ. 5,000 నగదును అందజేశారు.

ఆర్థిక సాయం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమెకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే పింఛన్ మంజూరయ్యేలా దరఖాస్తు చేయిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఈరమ్మ

కష్టకాలంలో తమను పరామర్శించి, ఆర్థిక భరోసా కల్పించినందుకు ఈరమ్మ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

అవ్వకు ధైర్యం చెబుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి