కర్నూలు జిల్లా ఆదోని మండలం కదితోట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గీతమ్మ అనే అయిదు నెలల బాలింత ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలుపడింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గీతమ్మ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి అనారోగ్యం కారణంగా భర్తకు ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినట్ల ఎస్ఐ తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన తెలిపారు.