విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదంఫ్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు 3 ఏసీ బోగీలుపూర్తి దగ్ధమైనయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలో పరుగులు తీశారు. పోలీసులు ప్రయాణికులను బయటకు పంపి రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు తెచరు. ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు.
చేనేత ప్రోత్సాహానికి శారీ వాక్
అమరావతి : విశాఖలో చేనేత ప్రోత్సాహానికి బీచ్ వద్ద శారీ వాక్ నిర్వహించారు మహిళలు. ఈ శారీ వాక్‍లో 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు పాల్గొన్నారు. “ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ” ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో శారీ వాక్ చేశారు. శారీ వాక్‍లో ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారుఅని ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల బతుకుల్లో వెలుగు […]
ఏపీలో పెన్షన్ల బదిలీలకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది.పెన్షన్ బదిలీలకు అవసరమయ్యేవి :1.పెన్షన్ ఐడి2.ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది..
రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 04 08 24
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు
కర్ణాటక: తుంగభద్ర: 04.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు.. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు. ఇన్ ఫ్లో : 136574 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 130855 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.883 టీఎంసీలు
శ్రీశైలం డ్యాంకు భారీగా కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం: 04 08 2024శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు.. డ్యామ్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,50,064 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వదిలిన అధికారులు.ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,24,868 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 200.1971 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
సబ్ కలెక్టర్ ను కలసిన ఆదోని తాసిల్దార్ ఆర్ శివరాముడు
కర్నూలు జిల్లా ఆదోని నూతన తాసిల్దార్ గా ఆర్. శివ రాముడు బాధ్యతలు స్వీకరించరు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో తాసిల్దార్ శివ రాముడు మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పనిచేస్తూ బదిలీపై ఆదోనికి వచ్చానని తెలిపారు. ప్రజల సమస్యలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుజలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,26,501క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 204.7888 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతి
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 03.08.2024 9am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 174675 క్యూసెక్కులుఇన్ ఫ్లో : 171353 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 174675 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.14 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 98.414 టీఎంసీలు
ఇరు వర్గాల ఘర్షణ పోలీసులకు గాయాలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో ఇరువర్గాలను చదరగొట్టే క్రమంలో సీఐ హనుమంతప్పకు మరియు పోలీసులకు గాయాలు అయ్యాయి.సీఐ హనుమంతప్ప ఆదోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.