Author: Public Judgement

పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

అమరావతీ : పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.

దుల్హన్ పథకం అమలు

వివాహ పథకం యొక్క ప్రయోజనాలుఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి: మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది.ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం రూ.1,00,000 అందిస్తుంది.దరఖాస్తుదారు వివాహ తేదీ నుండి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాలి.అర్హత ప్రమాణంఈ వివాహ పథకం కోసం […]

జై భీమ్ రావ్ భారత్ పార్టీకు రాజీనామా

2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక ఓటమి చెవి చూశారు మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న. కొన్ని అనివార్య కారణాలవల్ల జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధిష్టానానికి చరవాణి ద్వారా రాజీనామను తెలిపినట్లు విలేకరులకు సమాచారం అందించారు. పార్టీ పెద్ద వారు సానుకూలంగా స్పందించరని తెలిపారు. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-06-24 పత్తి అత్యధికంగా ₹. 7639 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4212/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6220 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4619/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5330/- రూపాయలు కనిష్ట ధర ₹. 2120/- రూపాయలు పలికింది.

కన్న బిడ్డను చంపుకున్న కసాయి తల్లి

కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో చోటుచేసుకుంది. దేవరబెట్టు గ్రామానికి చెందిన కొండ రామాంజనేయులు ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన హనుమంతమ్మకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు గత కొన్ని నెలలుగా హనుమంతమ్మ మానసిక […]

పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం.. సబ్ కలెక్టర్

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీ సెబ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం. వారు ఎలాంటి సాహసాలకైనా వెనుకడుగు వేయరు. కానీ […]

ఆర్లగడ్డ లో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత ఏవీ భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి..

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

భారత దేశ చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ కు ఎన్నిక

స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకునే స్పీకర్ పదవికి ఈసారి లోక్సభలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరిని స్పీకర్ గా నియమించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి ఉప స్పీకర్ ను ఎన్నుకుంటారు. కానీ ఈసారి బిజెపి పార్టీ ప్రతిపక్ష పార్టీకి సహకరించకపోవడంతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం కోరింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బుధవారం లోక్ సభ స్పీకర్ కు […]

Back To Top