కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు “రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ” పై ఆటో డ్రైవర్స్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డి.ఎస్.పి మేడం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆటో నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, మరియు యూనిఫామ్ కలిగి ఉండాలని […]
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వికలాంగుల పెన్షన్లు హోల్డ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ దివ్యాంగుల మండలాధ్యక్షుడు హనుమంత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. వెరిఫికేషన్‌కు ముందు మెమోలు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. కొంతమంది దివ్యాంగుల పెన్షన్ దారులకు ముందుగానే మెమోలు ఇచ్చినప్పటికీ, మరికొన్ని గ్రామాల్లో వెరిఫికేషన్ రోజే మెమోలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని, పలువురు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఇదే విషయంపై సోమవారం […]
విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను రద్దు చేయండి డి.ఎస్.ఎఫ్
విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అంబేద్కర్ సర్కిల్ వద్ద డి.ఎస్.ఎఫ్ విద్యార్థులు సంఘం నాయకులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన విద్యాశాఖ అధికారుల ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి […]
ఆటో అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామ సమీపంలో సోమవారం వాల్మీకి విగ్రహం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. గాయాలైన ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు జోహరాపురం గ్రామం నుంచి ఆదోనికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
స్మార్ట్ మీటర్లు మరియు కరెంట్ చార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం సిపిఎం
రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలోనే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయల కు పైగా కరెంటు చార్జీల బారాలు వేసిందని, ఇది చాలదన్నట్లు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించి మరింత భారం మోపాలని చూస్తుందని ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని, ఉద్యమాలలో కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ గౌస్, జిల్లా కార్యవర్గ […]
చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్ హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ, […]
కోట శ్రీనివాసరావు కన్నుమూత
Jul 13, 2025 కోట శ్రీనివాసరావు కన్నుమూత టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా డి.ఎస్.పి హేమలత ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. స్కూల్ కళాశాల సమీపంలో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న షాపులో సరుకును సీజ్ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ కళాశాల స్కూలకు 100 మీటర్ల వరకు ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మినా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు పలు షాపుల్లో దాడులు నిర్వహించామని […]
అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు ప్రవల్లిక గార్డెన్స్ నందు 4వ తేది జరిగిన అత్యాచారం కేసులో ఇస్వీ గ్రామానికి చెందిన ముద్దాయి సంగిపోగు రమేష్ ను కడితోట క్రాస్ వద్ద తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సిఐ నల్లప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాబడి సమాచారం మేరకు కడితోట క్రాస్ వద్ద సంగిపోగు రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టు లో హాజరు పరచి రిమాండ్ కు తరలించమని సిఐ […]
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
శుక్రవారం సా. 6 గంటల సమాచారం..తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.73 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 75.612 టీఎంసీలుప్రతిగంటకు చేరుతున్న ఇన్ ఫ్లో : 74555 క్యూసెక్కులుసుమారుగా ఒక రోజుకి ఇన్ ఫ్లో : 58027 క్యూసెక్కులునదిలోకి వదులుతున్న నీరు : 62610 క్యూసెక్కులుకెనాల్ కు వదులుతున్న నీరు : 2707 క్యూసెక్కులుమొత్తం అవుట్ ఫ్లో : 65616