Author: Public Judgement

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా […]

కుక్క దాడి 10 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

పాము కాటుకు మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో పాము కాటుకు మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.. ఉదయం పత్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్ళిన మంగమ్మ కు పాము కరిచిందని వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంగమ్మ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలపడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృతి

ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి . నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృత్యు వాత పడ్డారు . దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి  చెందిన ఏడు మంది విద్యార్దులు సరదాగా ఈత నేర్చుకోవడానికి జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటవద్దకు వెళ్ళారు. ఈత కొట్టడానికి కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం తో ప్రమాదవశాత్తు నీటి కుంటలో  మునిగిపోయారు . […]

కాలేజీలో టవర్ ను తొలగించండి.. పిడిఎస్ఓ విద్యార్థి సంఘం

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి పి డి ఎస్ ఓ విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో  నెట్వర్క్ టవర్ ముందు ధర్నా  కార్యక్రమం నిర్వహించారు. నెట్వర్క్ టవర్ ను తొలగించకపోతే దశల వారి ఉద్యమాలకు సిద్ధమవుతామని వీడియోసు విద్యార్థి సంఘం నాయకుడు హెచ్చరించారు. అనంతరం PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజ్ […]

పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని […]

సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా […]

కాలేజ్ ప్రాంగణంలో నెట్‌వర్క్ టవర్‌ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని […]

కర్రతో దాడి తలకు తీవ్ర గాయం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఉసేని అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉసేని తెలిపిన వివరాల మేరకు గ్రామంలో  ఘర్షణ పడుతున్నరని చూడడానికి వెళ్ళిన తనపై కర్రతో దాడి చేశారని  ఈ ఘర్షణకు తనకు ఎటువంటి సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని తెలిపారు.

ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయండి.. సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి  (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు  గుర్తుచేశారు . కానీ  ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు […]

Back To Top