అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ బిల్లులు కట్టాలని తెలిపారు.
RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APSPDCL డిస్కమ్ పేరు కనిపించదు. కనుక మీరు APSPDCL Consumer App ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గాని, లేదా మా డిస్కం వెబ్సైట్ https://www.apspdcl.in నుంచి గాని బిల్లులు చెల్లించవచ్చు. మా APSPDCL App లో గాని, లేదా మా డిస్కం వెబ్సైట్లో గాని మీరు బిల్లులు చెల్లించునప్పుడు మీరు మీ PhonePe, GPay, PayTM లేదా ఇతర UPI apps ని వాడవచ్చు. అలాగే మీరు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్ కార్డ్స్ కూడా వాడవచ్చు.