News
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు
అమరావతి. తేదీ 12.06.2024 ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామము వద్ద వున్న మేధా టవర్స్ ఐ.టి. పార్క్ ప్రదేశంలో జరుపుటకు నిర్ణయించినారు. ఈ కార్యక్రమానికి పలువురు VVIPలు , గవర్నర్, ముఖ్య నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనె అవకాశము ఉన్నందున. విజయవాడ నగరము నుండి గన్నవరం వైపుకు వెళ్ళు పలు వాహనముల రాకపోకలకు అసౌకర్యము కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ని మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

■ విజయవాడ నగరము లోని సాధారణ వాహనములు మళ్ళింపులు
★ విజయవాడ నుండి ఏలూరు మరియు విశాఖపట్నం వైపుకు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనములు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిలు నుండి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపుకు పంపబడును.
■ వియవాడ వెలుపల ట్రాన్స్ పోర్టు వాహనములు మళ్ళింపులు
★ విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు వచ్చు వాహనములు: హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం ఇరువైపుల
■ విశాఖపట్నం నుండి చెన్నై వైపుకు వచ్చు వాహనములు
★ హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ , పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు.
■ చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు వచ్చు వాహనములు
★ ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్
■ చెన్నై నుండి హైదరాబాద్ వైపుకు వెళ్ళు వాహనములు
★మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడెం, నల్గొండ నుండి వెళ్ళవలయును
■ హైదరాబాద్ నుండి గుంటూరు వైపుకు వచ్చు వాహనములు
★నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ళ, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుండి వెళ్ళవలయును
■ RTC బస్సులు మళ్ళింపులు
■ విజయవాడ ఏలూరు వైపుకు వెళ్ళు బస్సులు
★PNBS నుండి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంటగుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపుకు వెళ్ళ వలెను.

విజయవాడ రామవరప్పాడు రింగ్ నుండి గన్నవరం వైపుకు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమమునకు వెళ్ళు వాహనములు మరియు అంబుల్లన్స్ , అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనములు తప్ప మరి ఏ ఇతరవాహనములు గన్నవరం వైపుకు అనుమతించబడవు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించబడతాయి. కావున 12.06.2024 “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ప్రమాణ స్వీకారోత్సవం” కార్యక్రమం సందర్భముగా ట్రాఫిక్ అవాంతరాలు, ప్రజలకు ఇబ్బందులు సాధ్యమైనంత కనీస స్థాయిలో ఉండేందుకుగాను చేపట్టిన ట్రాఫిక్ మళ్ళిoపు చర్యలను నగర ప్రజలందరు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

News
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


