Connect with us

News

ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Published

on

తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించరు. బండిమెట్ట అంగన్వాడి సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ లో ఉన్న దానికంటే స్టాక్ ఎక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ కు మేము జారీ చేసి చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఆదేశించారు. అనంతరం. ఆరెకల్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో చాలా బాగా చదువుతున్నారని వారికి ప్రోత్సాహకర అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి 2000 రూపాయల వాచ్ కొనివ్వలని ప్రిన్సిపల్ కు 2000 అందించారు. విరుపాపురం గ్రామంలో zphs స్కూల్ ఆహారం రుచిగా లేదంటు విద్యార్థు ఫిర్యాదు చేశారు. ఆహారాన్ని రుచి చూసి సరిగ్గ లేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల వరకు అనుమతిస్తున్నానని అంతలోపు మార్పు రాకపోతే అందర్నీ తొలగించి కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థినీలతో మాట్లాడుతున్న ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప రెడ్డి
యూట్యూబ్ వీడియో లింక్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 06.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 06 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1621.22 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   60751 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 50500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1449 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.979 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ పంటలు: […]

Published

on

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ధనాపురం, నారాయణపురం గ్రామాల్లో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ ఎస్. ఐసా పర్వీన్, డాక్టర్ ఎస్. రమాదేవి మరియు అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

రైతులకు అవగాహన కలిగిస్తున్న వ్యవసాయ అధికారులు

ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. పంట బీమా తప్పనిసరి: ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షణ పొందడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలి. తేమ సంరక్షణ: నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు పాటించాలి. సమతుల్య ఎరువుల వాడకం, కలుపు నివారణ, సరైన సమయంలో యాజమాన్య చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. పత్తి పంటకు స్ప్రే: ఎండ తీవ్రత, బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి పత్తి పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13:0:45) లేదా 10 గ్రాముల 19:19:19 నీటిలో కరిగే ఎరువును కలిపి పిచికారీ చేయాలి.హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె అధికారి నిరంజన్, వ్యవసాయ విస్తరణ అధికారి పి. సతీష్, గ్రామ వ్యవసాయ సహాయకులు నళిని, హరి రామ్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Continue Reading

News

దళిత కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించండి

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ (KVPS), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి. తిక్కప్ప మాట్లాడారు. మండలంలోని బసరకోడు, ఆరేకల్లు, నారాయణపురం, డాణాపురం, పెద్ద […]

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ (KVPS), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

​ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి. తిక్కప్ప మాట్లాడారు. మండలంలోని బసరకోడు, ఆరేకల్లు, నారాయణపురం, డాణాపురం, పెద్ద తుంబలం, సంతేకుడ్లూరు తదితర గ్రామాలలోని దళిత కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా డాణాపురం, సంతేకుడ్లూరు, నారాయణపురం గ్రామాల్లో కేవలం దళిత కాలనీలకు మాత్రమే మంచినీటి సరఫరా నిలిపివేయడం వివక్షతకు అద్దం పడుతోందని, ఇది అత్యంత శోచనీయమని మండిపడ్డారు. ​అలాగే హానవాళ్, చిన్న హరివాణం, పెద్ద హరివాణం, చాగి తదితర గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. దళితుల స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించడంతో పాటు అంత్యక్రియల అనంతరం శుభ్రం చేసుకోవడానికి నీటి సదుపాయం కూడా లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే మంజూరు చేసి దళిత కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఫోటో

​ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి వీరారెడ్డి, అధ్యక్షుడు రామాంజనేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మునిస్వామి, ఉపాధ్యక్షుడు పరమేష్, డ్యాఫై (DYFI) మండల ఉపాధ్యక్షుడు చిరంజీవి, డప్పు కళాకారుల సంఘం నాయకుడు రామాంజనేయులు, కేవీపీఎస్ నాయకులు అంజి, నాగరాజు, దర్గయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శంకరప్ప, రామప్ప, శ్రీనివాసులు, కె. ఆంజనేయ, రైతు సంఘం నాయకుడు తిక్కన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending