News
కర్నూల్ లో ఏసిబి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం

కర్నూలు నగరంలో డిజిపి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత ఇంట్లో ఇంకా ఏసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400 అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
కర్నూల్ లో ఏసిబి సోదాలు చేస్తున్న వీడియో
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 02 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు


News
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 77.144 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 32767 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1701 క్యూసెక్కులు
బుధవారం 02 వ తేదీ ఉదయం 11 గంటలకు 2000 క్యూసెక్కుల నుంచి 20000 క్యూసెక్కులు నీరుని నదిలోకి వదులుతున్నాట్లు డ్యాం అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీ లోంచి తలలు బయటికి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.



-
News3 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News1 day ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News3 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News5 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ