మహిళా కార్మికురాలిపై పెట్రోల్‌ దాడి చేసిన ఆరుగురు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని లో ఆదివారం రోజు మున్సిపల్ మహిళా కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆరుగురు నిందితులను ఆదోని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టరు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు డిఎస్పి వెంకటరమణ తెలిపారు.

నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు

డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం… ఇందిరా నగర్‌కు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ (26)తో చిన్న ఈరన్న అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో కుటుంబ కలహాల కారణంగా చిన్న ఈరన్న  జూలై 26న ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ మృతికి నరసమ్మే కారణమని ఈరన్న కుటుంబ సభ్యులు ఆమెపై కక్ష పెంచుకొని సెప్టెంబర్ 6న తెల్లవారుజామున 05:30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నరసమ్మ విధులు నిర్వహిస్తుండగా ఈరన్న భార్య శిరీష, బంధువులు రాములమ్మ, సుజాత, ఈరన్న, హేమ, అంజినమ్మ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి ఆమె కళ్లలో కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ఆరుగురు నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ (26)
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి