మత సామరస్యానికి ప్రతీక

అనంతపురం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రయాన్ సేవా సమితి ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పండుగ కానుకగా అందజేశారు. స్థానిక ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ ఆశ్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు లాల్ బాషా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు మోచి చంద్రశేఖర్ లబ్ధిదారులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

వేళ వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

ఈ సేవా కార్యక్రమానికి జమాఅతే ఇస్లామీ హింద్ అనంతపురం సిటీ సెక్రటరీ హాజీపీరా, ప్రభుత్వ ఖాజీ జాహిద్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు. మత సామరస్యం, పరస్పర గౌరవం, సేవాభావం ఉన్నప్పుడే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రముఖులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

వేళ వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ
వేళ వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి