Connect with us

News

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

Published

on

కర్నూలు జిల్లా కౌతాళం మండలం గొప్పగన్ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని కౌతాళం మండలానికి చెందిన నర్సారెడ్డి (S/o పెట్టి రామన్న) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోనికి వచ్చి తిరిగి కౌతాళం కి వెళ్తుండగా గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు లారీ ఢీ ప్రమాదంలో మృతి చెందాలని ఆరోపిస్తున్నారు. కౌతాలంకి చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్ నాయుడు బాధిత కుటుంబాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడుతూన్న సురేష్ నాయుడు
ప్రమాదంలో మృతి చెందిన నర్సిరెడ్డి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

Published

on

ఆదోని, జూలై 07, 2026:

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ పరిధిలోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ SGSW వారి ఉత్తర్వుల ప్రకారం.. విద్యార్థులు తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ (MBU) చేసుకోవడానికి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

క్యాంపుల నిర్వహణ తేదీలు & సమయం:

ఈ ప్రత్యేక క్యాంపులు మొదటి విడతగా జూలై 14, 2026 నుండి జూలై 17, 2026 వరకు, అలాగే రెండవ విడతగా జూలై 21, 2026 నుండి జూలై 24, 2026 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి.

ఆధార్ క్యాంపులు జరిగే కేంద్రాలు – సంప్రదించాల్సిన వివరాలు:

  • 18వ వార్డు మున్సిపల్ ప్రైమరీ స్కూల్: వి. ప్రభాకర్ (సెల్: 8639703508)
  • నోబుల్ వోకేషనల్ కాలేజ్: జి.పి. హిమ బిందు (సెల్: 7095638185)
  • సాయి జూనియర్ కాలేజ్: ఎస్. దేవానంద్ (సెల్: 9642990737)
  • గర్ల్స్ హైస్కూల్: జి. నాగేష్ (సెల్: 9848982361)
  • అక్షర శ్రీ జూనియర్ కాలేజ్: వై. వెంకటేష్ (సెల్: 9642080186)
  • ఆల్ఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్: జె. రాజశేఖర్ (సెల్: 8522812267)
  • గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్: ఎం. కోసిగయ్య (సెల్: 9885052859)
  • బాలాజీ జూనియర్ కాలేజ్: ఎస్. నాగరాజు (సెల్: 9542486819)

ముఖ్య గమనిక:

మున్సిపల్ పరిధిలోని ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరూ, తమ ఆధార్ కార్డులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ (Mandatory Biometric Update – MBU) చేయించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆదోని పురపాలక సంఘం కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Continue Reading

News

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహిస్తున్న ప్రజలకోసం మీ పార్థసారథి కార్యక్రమంలో ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. గత ప్రభుత్వ పథకం పేరును ఎమ్మెల్యే ప్రస్తావించడం.. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఫుల్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ప్రజల కోసం మీ పార్థసారథి పేరుతో స్థానికంగా తిరుగుతూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా ఒక మహిళ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి.. తనకు గత వైసిపి ప్రభుత్వ హయాంలో రావాల్సిన ‘అమ్మ ఒడి’ పథకం రాలేదంటూ తన బాధను చెప్పుకుంది. మహిళ సమస్య విన్న ఎమ్మెల్యే పార్థసారథి.. స్పందిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ‘తల్లికి వందనం’ పేరును ప్రస్తావించాల్సింది పోయి.. యథాలాపంగా జగన్ ప్రభుత్వ కాలం నాటి ‘అమ్మ ఒడి’ అనే పదాన్నే వాడేశారు. ఎమ్మెల్యే నోట ‘అమ్మ ఒడి’ అనే మాట రావడాన్ని గమనించిన పక్కనే ఉన్న కూటమి నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఎమ్మెల్యే గారికి దగ్గరగా జరిగి.. “అది అమ్మ ఒడి కాదు సార్.. తల్లికి వందనం అని చెప్పండి” అంటూ మెల్లగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పక్కనున్న నాయకులు సరిచేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం తగ్గకుండా కాస్త ఎటకారంగా సమాధానమిచ్చారు.

ప్రజల కోసం ఈ పాఠశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫోటో

“ఆ పేరు (తల్లికి వందనం) ఇంకా ప్రజలకు తెలీదు.. అది ఇంకా అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు” అంటూ వ్యాఖ్యానించారు. సొంత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై.. కూటమి ఎమ్మెల్యేనే ఇలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆదోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Continue Reading

News

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనాంశాలపై కలెక్టర్ సిరి నూతన ఆర్డీవోకు పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మకు పూల మొక్క  అందజేస్తున్న ఫోటో
కలెక్టర్ కార్యాలయంలో పూల మొక్క అందజేస్తున్న ఆదోని ఆర్ డి ఓ అరుణ దేవి
Continue Reading
News2 hours ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News21 hours ago

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

News22 hours ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News1 day ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News4 days ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News2 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News2 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News2 weeks ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News1 month ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News1 month ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Trending