News
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన
కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం చేసి ప్రేమికుడు గురు పారిపోయాడంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

అమ్మాయి చందన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైసూరుకు చెందిన యువతి చందన మంజునాథ , ఆదోని అబ్బాయి గురు ఈశ్వర్ ప్రసాద్ బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తు ప్రేమలో పడ్డారు. ప్రేమవ్యవహారం పెళ్లివరకు వచ్చి బెంగళూరులో రెండు కుటుంబాల మధ్యనే నిశ్చితార్థం చేసుకున్నారు. చివరకు కట్న కానుకల విషయంలో గురు ఈశ్వర్ తల్లితండ్రులు పట్టుబట్టడంతో ఈశ్వర్ ఆఫీస్ రాకుండా ముఖం చాటేసి ఆదోని చేరుకున్నడు. విషయం తెలుసుకుని వారం రోజుల క్రితం చందన మంజునాథ్ ఆదోనికి రావడంతో ప్రియుడు ఈశ్వర్ అతని తల్లి తండ్రులు నాగరాజు, నాగవేణి ఇల్లు వదిలి వెళ్లిపోయారని చందన తెలిపింది. ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు తెలిపింది.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




