News
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

అమరావతి: టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రికార్డు సృష్టించడానికి సిద్ధం కండి అన్నారు. బాబు ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందిని తెలిపారు. సభ్యత్వ రుసుము 100 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సభ్యత్వం పొందిన వారికి 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 07 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News13 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు