తుంగభద్రా డ్యాం:  నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రకటించారు. నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందునా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగా గజాయితగాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

నది తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
◆ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండండి..
◆ గ్రామ ప్రజలు నదితీరా ప్రాంతాల్లోకి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి.
◆ ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్లోని కౌతాళం మండలం మేలగనూరు మరియు కుంబలనూర్ , నది తీర ప్రాంతాలను పరిశీలించి తనిఖీ చేశారు. ఆదోని డివిజన్లో తీర ప్రాంతంలో ఉన్న కౌతళం, కోసిగి, నందవరం మండలలో నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తీరప్రాంతంలో సంబంధిత మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఇరిగేషన్, గజఈతగాళ్లు, అప్రమత్తంగా ఉండాలన్నారు. లైఫ్ జాకెట్లు, SDRF బృందాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఆదోని డివిజన్లో రెండు టీం రాష్ట్ర విపత్తు రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండగా వారికి పలు సూచనలు సబ్ కలెక్టర్ చేశారు.

నదీతీర ప్రాంతాల్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *