News
రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి
కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతం బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ రోడ్డు, లక్ష్మవ్వ సర్కిల్, సిరిగుప్ప సర్కిల్ మరియు టౌన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు విత్ రేడియం ఇండికేటర్స్ వేయాలని అలాగే సైన్ బోర్డ్స్, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపినారు.
News
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి
ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
News
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి
ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 14.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 14 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.75 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 89.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 27897 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 25197 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 4665 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 88396 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News3 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News4 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News1 week ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
News2 days ago
వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ
-
News4 weeks ago
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి