News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




