Connect with us

News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే హక్కు రాష్ట్రపతికే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిజెపి నియంత ప్రభుత్వ వైఖరికి గిరిజన సంఘాలు మొత్తం ఏక కంఠంతో ఖండిస్తున్నాం అని అన్నారు. గిరిజన ప్రజానీకానికి ఈ దేశంలో అత్యున్నత స్థానం కల్పించేలా చేసిందని బిజెపి సంకలు గుద్దుకుండంతో నేడు అదే గిరిజన మహిళలకు నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం గోరమైన అవమానం అని నిప్పులు చెరిగారు. రాజకీయపరంగా గిరిజనులను బిజెపి ప్రభుత్వం అవసరానికి వాడుకుంటున్నాయని అనడంలో తేటతెల్లం అయిందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు మారుతి రావు, హనుమేష్, రామకృష్ణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

​భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి

Published

on

ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్

అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రజలు
భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.

భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్
Continue Reading

News

​భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి

Published

on

ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ​అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.

ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ సిరి
సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రజలు
భూమి పత్రాలు రైతులకు అందజేస్తున్న కలెక్టర్ సిరి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.

సమస్యలను వింటున్న జిల్లా కలెక్టర్ సిరి

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న కలెక్టర్ ఎమ్మెల్యే
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 14.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 14 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.75 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 89.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 27897 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 25197 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 4665 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 88396 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending