కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ రోడ్డు బాట మారెమ్మ గుడి సమీపంలో ఉల్లిగడ్డల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు గుల్బర్గా నుంచి ఉల్లిగడ్డలు వేసుకొని వెళ్తుండగా ఆటో సడన్గా అడ్డం రావడంతో అదుపుతప్పి టైర్ పగిలి కింద పడిందని అయితే డ్రైవర్కి, క్లీనర్కి ఎటువంటి గాయాలు కాలేదు అని తెలిపారు.