News
ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు పిల్లలు పెద్దలు వృద్ధులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్ల ఆపరేషన్ కళ్ళకు అత్యాధునిక లెన్స్ కూడా ఉచితంగా అమర్చి కంటి బాధితులకు ఉచిత వసతి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నుండి కర్నూలు మరియు కర్నూలు నుండి అదోనికి వచ్చేవరకు రవాణా సౌకర్యం కల్పించబడునని అలాగే ఆపరేషన్ చేయించుకునెవారు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు ఆపరేషన్లు మందులు ఇవ్వబడునని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత, ప్రతాప్ హిమబిందు, వంగదారి గీత, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర