Connect with us

News

అక్రమంగా కొండలు పిండి చేస్తున్నారు

Published

on

అనుమతులు లేవు.. అధికారులు అంటే భయములేదు.. ప్రాణాలనుతెగించి పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.. కొండలను పిండి చేస్తున్న హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వాకంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు..

తనిఖీలు చేస్తున్న ఎమ్మార్వో శివరముడు

కర్నూలు జిల్లా ఆదోని శివారు మండిగిరి 586 సర్వేలో అనుమతులు లేకుండా జిల్టెన్ స్టిక్క్స్ పెట్టి కొండలు పిండి చేస్తున్నరు కాంట్రాక్టర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఎమ్మార్వో శివరాముడు పరిశీలించి అక్కడే భారీ ఎత్తులో దాచి ఉంచిన జెలిటీన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను రెవెన్యు అధికారులు స్వాధీనం చేసుకొని 3టౌన్ పోలీసులకు అప్పగించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో వర్కర్లు ట్రాక్టర్లతో అక్కడినుంచి పరారు అయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో శివరముడు తెలిపారు.

ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు

గోపాల్ రెడ్డి స్టానికుడు మాట్లాడుతూ..
రాత్రిపూట శబ్దాలకు ఇబంది పడున్నామని స్థానికులు పోలీస్ అధికారులకు రెండు నెలలో ఎన్నిసార్లు విన్నవించుకున్న పాటించుకోవడం లేదని తెలిపారు. మాకు సంబంధము లేదు మైనింగ్ వాళ్ళని అడగమని చెప్పి తపించు కుంరున్నారని స్థానికులు ఆరోపించారు. అయిన కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులకు అడిగితే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపీజనట్లు తెలిపారు.

యూట్యూబ్ వీడియో
కొండలకు రంద్రాలు వేస్తున్న  కార్మికులకు
ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు
కొండలలో పని వేస్తున్న  కార్మికులకు

Continue Reading
1 Comment

1 Comment

  1. K.Nagaraju

    25/08/2024 at 10:58 pm

    Dear sir
    ఇలా అన్ని దొంగ దారిలోనే ఆదోని బై పాస్ పనులు జరుగుతున్నాయి
    1 లే అవుట్,ప్లాట్స్ మరియు ఇండ్లు లేవని
    రోడ్ తీసుకువచ్చారు మరియు వేస్తున్నారు
    2. ఇది ఆదోని కి ప్రశ్నార్థకంగా మిగిలిపోయే రోడ్ కారణం 1.2km లో రెండు ఫ్లైఓవర్ వేస్తున్నారు.
    3.లాండ్ Aquiring 90% పూర్తి అయిన తరువాత రోడ్ పనులు కాంట్రాక్టర్ రోడ్ పనులు స్టార్ట్ చేయాలి కానీ 15% జరిగిన స్టార్ట్ చేశాడు.
    4.మాజీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో లబ్ధి పొందాలని రోడ్ పనులు స్టార్ట్ చేసిన కాంట్రాక్టర్.
    5.రోడ్ వెయ్యడాని కోసం కాంట్రాక్టర్ ఎంచుకున్న మార్గం మంచిదికాదు
    6 ఈదేవిషయం పై జూలై 3rd ,August 15th,17,and 21St నా DSP, II CI మరియు తాలూకా CI కి కంప్లైంట్ ఈచ్చిన కాంట్రాక్టరు పై కేస్ నమోదు చెయ్యమని రిక్విస్ట్ చేసిన అక్కడ అలాంటివి జరగలేదు అంటూ II CI గారు చెప్పడం లో జరిగిన నిజాలు బయటికి చెప్పాలి
    7. ఇన్ని సాక్షాలు ఉంచిన ఇవి,వారివి కాధనో,మరో విధంగానే జరుగుతుంది అంతే తప్ప న్యాయం జరగదు.
    8.ఇక్కడ అధికారులు తప్పు మార్గాన్ని ఎన్నుకొని ,అధి నిజ మని నిరిపిస్తున్నరు,దీనికి తప్పని తెలిసిన ప్రజా ప్రతినిధులు మౌనంగా ఉండి చూస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ  స్వాధీనం చేసుకున్నరు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వాధీనం చేసుకున్న నగదును వివరిస్తున్న డి.ఎస్.పి సీఐ
మీడియా ముందు నగదును ప్రదర్శించిన ఎస్పీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్
Continue Reading

News

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

Published

on

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం  తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

Published

on

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది.

మృతురాలు మౌనిక

బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీసుకుతుండగా కూతురు మౌనిక అడ్డుకొని డబ్బు తీసుకున్న విషయం నాన్నమ్మ కు చెబుతానని చెప్పడంతో తాగిన మత్తులో దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని తాడుతో గొంతు బిగించి హత్య చేశాడని బంధువులు తెలిపారు.

ఏరియా హాస్పిటల్ వద్ద మృతురాలి బంధువులు

పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు వీరేశ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పోస్టుమార్టం రూమ్ వద్ద బంధువులు
Continue Reading

Trending