రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారస్తులు

◆ రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ జలగలు
◆ అధిక వడ్డీలకు అప్పులు, కట్టలేకపోతే వేధింపులు..
◆ ఊళ్లు వదిలి వెళ్తున్న పలువురు బాధితులు..
◆ ఆత్మహత్యలూ చేసుకుంటున్న దుస్థితి..
◆ ఇళ్లు, ఆస్తులు రాయించుకుంటున్న వైనం..

విజయ్ ఫ్యామిలీ ఫోటో

వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి రైతులు, చిరు వ్యాపారులు, తోపుడుబండి, చాట్‌, చికెన, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగు ఊళ్లు వదులుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూళ్లకు పాల్పడుతున్నారు, ఇక ఆటోలపై ఫైనాన్స్ కావాలంటే డాకుమెంట్ చార్జెస్ అని ఆలస్యం అయితే ఫైన్ అని వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. వడ్డీలు కట్టలేక ప్రాణాలు వదులుతున్నారు.

కర్నూలు జిల్లా మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన విజయ్ అనే 32 సంవత్సరాల యువరైతు అప్పుల బాధ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం వచ్చి 20 రోజుల క్రితం భార్యా ఇద్దరు ఆడపిల్లలతో ఊరు వదిలి ఆదోనికి చేరుకొని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా వడ్డీ జలగల వేధింపులకు తట్టుకోలేక ఇటు సంసారం నడుపుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆదోని – ఇస్వి అప్ రైల్వే లైన్ KM NO: 499/15 వద్ద ట్రైన్ NO 12163 కింద పడి రైతు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రైల్వే ఎస్ఐ రామస్వామి ఇచ్చిన వివరాల మేరకు మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన జి. పకీరప్ప కుమారుడు విజయ్ (32) అప్పుల బాధ తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామస్వామి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top